నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నెల్లూరుకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన అవయవదానంతో ముగ్గురికి కొత్త జీవితం లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన (28 ఏండ్లు) జావా సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ విషాద సమయంలోనూ ఆ యువకుని కుటుంబం అవయవదానం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆ యువ ఇంజినీర్ ఆగస్టు 30న ద్విచక్రవాహనం ఢకొీని తీవ్రగాయాల పాలయ్యారు. ఆయనను మొదట ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్టార్ ఆస్పత్రికి తరలించి…నిరంతర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో సెప్టెంబర్ 2న న్యూరాలజికల్ టెస్టులు, ఈఈజీ రిపోర్టులు, రెండు అప్నియా టెస్టులు చేసి అనంతరం బ్రెయిన్‌డెత్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. ఇంజినీర్ అవయవదానంతో ఆయన కాలేయం ఒకరికి, ఒక మూత్రపిండం మరొక రోగికి విజయవంతంగా అమర్చారు. రెండో మూత్రపిండాన్ని మరో ప్రయివేటు ఆస్పత్రిలోని రోగికి అందించడంతో ముగ్గురికి కొత్త జీవితం లభించింది. అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబానికి స్టార్ ఆస్పత్రి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.
యువ ఇంజినీర్ అవయవదానంతో ముగ్గురికి కొత్త జీవితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES