నవతెలంగాణ-హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇందుకూరుపేట మండలం మైపాడ్ బీచ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్ చదువుతున్న ముగ్గురు స్నేహితులు సరదాగా ఆదివారం మధ్యాహ్నం మైపాడు బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తూ.. ప్రమాదవశాత్తు అలల్లో చిక్కుకున్నారు. కేకలు వేయడంతో.. అక్కడున్న మెరైన్ పోలీసులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతులను నెల్లూరు జిల్లా కోటమిట్టకు చెందిన హుమయోను, సమీద్దు, నారాయణరెడ్డి పేటకు చెందిన తాజీమ్‌గా గుర్తించారు. ఇటీవల తుపాను ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై నాగార్జునరెడ్డి సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మైపాడు బీచ్‌లో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



