ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిపై వివరణ
స్టాకహేోం : ‘ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని’ వివరించినందుకు గానూ ఈ ఏడాది ముగ్గురు పరిశోధకులు జోయల్ మోకిర్, ఫిలిప్ అగియన్, పీటర్ హోవిట్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. వీరిలో జోయల్ మోకిర్‌కు బహుమతిలో సగం మొత్తం చెందుతుంది. సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిర వృద్ధిని సాధించేందుకు ముందస్తుగా అవసరమైనవాటిని గుర్తించడానికి ఆయన కృషి చేశారు. మిగిలిన సగం మొత్తాన్ని అగియన్, హోవిట్‌లు పంచుకుంటారు. ‘సృజనాత్మకమైన విధ్వంసం ద్వారా సుస్థిర వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించినందుకు’ గానూ వీరికి ఈ మొత్తం లభిస్తోంది. సుస్థిరమైన అభివృద్ధి లేదా పురోగతి అనేది సరికొత్త సాధారణ స్థాయికి మారేందుకు గల కారణాలు వెల్లడించడానికి చారిత్రవ వనరులను ఒక మార్గంగా మోకిర్ ఉపయోగించారు. ఈ సుస్థిర వృద్ధి వెనుక గల మెకానిజంను అగియన్, పీటర్ హొవిట్‌లు కూడా అధ్యయనం చేశారు. 1992లో వారు సృజనాత్మక విధ్వంసం అని పిలిచే ఒక గణిత నమూనాను రూపొందించారు. ఈ మేరకు వారు ఒక వ్యాసం కూడా రాశారు. ఇక్కడ సృజనాత్మక విధ్వంసం అంటే కొత్తదైన, మెరుగైన ఉత్పత్తి మార్కెట్‌లోకి ప్రవేశిస్తే, కంపెనీలు పాత ఉత్పత్తులను తక్కువ మొత్తాలకు విక్రయించడమని వారు పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.
వీరిలో జోయెల్ మోకిర్ నెదర్లాండ్స్‌లో జన్మించారు. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా వున్నారు. ఫిలిప్ అగియన్ ఫ్రాన్స్‌లోని ఒక ఉన్నత విద్యా, పరిశోధన సంస్థ అయిన కాలేజ్ డి ఫ్రాన్స్‌లో, పారిస్‌లోని ఐఎన్‌ఎస్‌ఇఎడి, యుకెలోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. పీటర్ హోవిట్ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES