Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమిషన్‌ భగీరథ సంపులో పడి ముగ్గురు కార్మికులు మృతి

మిషన్‌ భగీరథ సంపులో పడి ముగ్గురు కార్మికులు మృతి

- Advertisement -

మరొకరి పరిస్థితి విషమం
కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్‌

నవతెలంగాణ-చర్ల
మిషన్‌ భగీరథ సంపులో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉంజుపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన మిషన్‌ భగీరథ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ (సంపు)లో మోటర్‌ అమర్చేందుకు నలుగురు కార్మికులు ట్యాంక్‌ లోపలికి దిగారు. అయితే లోపల ఆక్సిజన్‌ సరిపోక ఊపిరాడకపోవడంతో కార్మికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు నీలం తులసీరామ్‌(37), కాకా మహేష్‌(36) మృతి చెందారు. మరో ఇద్దరిని చర్ల ఆస్పత్రికి తరలించగా, వారిలో ఈనాషా(50) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. కాగా, మృతి చెందిన కార్మికులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్‌ డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథలో నైపుణ్యమైన ఇంజనీర్లు గాని, ఇతర అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -