‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా, సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్శకుడు సుధీర్ శ్రీరామ్ సోమవారం మీడియాతో ముచ్చటించారు.
-నైన్టీస్ సినిమాలో శివాజీని చూడగానే మా నాన్న గుర్తొచ్చారు. కథలు చెప్పే సమయంలో ఆయనకు ఎందుకు ఈ కథ చెప్పకూడదు? అనిపించి శివాజీని అప్రోచ్ అయ్యాను. కథ వినగానే ఆయన ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. ఆ మాట వినగానే ఎంతో హ్యపీగా అనిపించింది. ఈ కథను శివాజీ ఈటీవీ వాళ్లకు కూడా చెప్పమన్నారు. నితిన్, సాయికృష్ణ కథ విని, ఓకే చేశారు. ఫైనల్‌గా బాపినీడు కూడా ఓకే చేశారు అప్పటి నుంచి ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది.
-ఈ కథ క్రైమ్ కామెడీ. దర్శకుడు నెల్సన్ తెరకెక్కించే సినిమా తరహాలో ఉంటుంది. ‘కో..కో.కోకిల, డాక్టర్’ సినిమాలా డార్క్ కామెడీ ఉంటూ థ్రిల్లింగ్ నేపథ్యం ఉంటుంది. డెఫినెట్‌గా ఫ్యామిలీ మొత్తం థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఫన్‌తో పాటు ఎమోషన్ ఉంటుంది.
-ఈ కథలో అన్ని పాత్రలకు ఫర్‌ఫెక్ట్ ఆర్టిస్టులు కుదిరారు. ప్రతి క్యారెక్టర్‌లో కొత్త కోణం ఉంటుంది. ఈ సినిమా ప్రారంభం కాగానే మొదటి 20 నిమిషాల తరువాత మరో కోణంలోకి వెళుతుంది.
-అనిల్ రావిపూడితో పాటు కొంత మంది సినిమా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఫస్టాఫ్ హిలేరియస్‌గా ఎంజాయ్ చేశారు. సెకండాఫ్‌లో సస్పెన్స్ చూసి ఎంతో థ్రిల్ల్‌గా ఫీలయ్యారు.
థియేటర్లలో థ్రిల్ చేస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



