Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉత్కంఠభరితం నల్లగొండ లెక్కింపు

ఉత్కంఠభరితం నల్లగొండ లెక్కింపు

- Advertisement -

మూడు డివిజన్లలో రీకౌంటింగ్‌.. ఫలితం తారుమారు
చిట్యాలలో ట్రాన్స్‌జెండర్‌ గెలుపు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మున్సిపాలిటీలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. నల్లగొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌ గ్రేడ్‌ అయి తొలిసారి జరిగిన నగరపాలక ఎన్నికలలో 48 డివిజన్లో గాను 27 డివిజన్లు కాంగ్రెస్‌ కైవసం చేసుకుని తొలి మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. నల్లగొండ జిల్లాలో 162 స్థానాలలో ఎన్నిక జరగగా కాంగ్రెస్‌ పార్టీ 106 స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్‌ఎస్‌ 36 వార్డులో గెలుపొందింది. బీజేపీ ఆరు వార్డులకు పరిమితమైంది. ఎంఐఎం రెండు స్థానాలు, సిపిఐ ఒకటి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఐదు స్థానాలు స్వతత్ర అభ్యర్థులు ఆరు స్థానాలు గెలుపొందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ మాత్రమే బీఆర్‌ఎస్‌ 12 స్థానాలు గెలిచి చైర్మెన్‌ స్థానాన్ని దక్కించుకుంది. భూదాన్‌ పోచంపల్లిలో స్వతంత్ర అభ్యర్థితో కలిపి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు క్యాంపుకు ప్రయాణమయ్యారు. నల్లగొండ నగరపాలక సంస్థ తొలిసారి జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరితంగా సాగింది .కాంగ్రెస్‌ కు స్వతంత్ర అభ్యర్థులు, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చాయి. నువ్వా నేనా అన్నట్టుగా లెక్కింపు ప్రక్రియ సాగింది. 27 డివిజన్లు గెలుపొందిన కాంగ్రెస్‌ లెక్కింపు ప్రక్రియలో అతి ఉత్సాహం చూపిస్తూ 6, 14,29 డివిజన్లో రీకౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రీ కౌంటింగ్‌ కు కోరారు. ఆరో డివిజన్లో బి ర్‌ఎస్‌ గెలుపొందినప్పటికీ రీ కౌంటింగ్‌ కోసం కోరారు. అయినప్పటికీ బిఆర్‌ఎస్‌ ఆస్థానాన్ని దక్కించు కుంది. 14వ డివిజన్లో మొదట బీఆర్‌ఎస్‌ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. తిరిగి కౌంటింగ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ అభ్యర్థులు పట్టుపట్టడంతో రీకౌంటింగ్‌ ప్రక్రియలో కాంగ్రెస్‌ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 29వ డివిజన్లో ఏడు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ పై ఎంఐఎం అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రీకౌంటింగ్‌ నిర్వహించాలని కోరడంతో అధికారులు మూడుసార్లు రీకౌంటింగ్‌ నిర్వహించారు. అయిన ప్పటికీ 7 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ పై ఎంఐఎం విజయం సాధించింది. చిట్యాల మున్సిపాలిటీలో ఒకటో వార్డు ఎస్సీ జనరల్‌ రిజర్వుడైన స్థానంలో శివనేనిగూడెం గ్రామానికి చెందిన సుధాకర్‌ రావు ట్రాంజెండర్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -