నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘షో టైం’. అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మించారు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, ‘డైరెక్టర్ మదన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక ఫ్యామిలీలో తక్కువ క్యారెక్టర్ల మధ్య సాగే ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రతీ అంశం ప్రేక్షకుడిని రంజింప చేస్తుంది’ అని అన్నారు. ‘ఇందులో చాలా మంచి పోలీసు క్యారెక్టర్ చేశాను. అయితే క్యారెక్టర్ చాలా సీరియస్‌గా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది’ అని రాజా రవీంద్ర చెప్పారు.
‘ఇలాంటి జోనర్స్ మలయాళంలో ఎక్కువగా వస్తాయి. తెలుగులో వర్కౌట్ అవుతాయా? అంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. అందుకే ఇలాంటి కథని ఎంచుకున్నాం. మా ట్రైలర్‌ని చూసి ‘దశ్యం’ సినిమాలా అనిపించిందని చాలా మంది అన్నారు. ఇది కూడా ఫ్యామిలీని కాపాడే కథే. అంత పెద్ద సినిమాతో పోల్చడం సంతోషంగా ఉంది. కానీ ఇది ఆ సినిమాకు భిన్నం. మా సినిమా చాలా కొత్తగా, చాలా ఆసక్తిగా ఉంటుంది. విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుంది. ఓ సరికొత్త ప్రయత్నంతో విన్నూతమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుంది’ అని డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి తెలిపారు.
థ్రిల్ చేసే ‘షో టైమ్’
- Advertisement -
- Advertisement -