నందు, అవికా గోర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ‘హే ప్రియతమా’ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ ఇంటెన్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌లో పర్వర్ట్ క్యారెక్టర్‌గా నందుని పరిచయం చేశారు. అవికా గోర్ మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పినా సరే నందు వదలడు. వేధిస్తాడు. ‘వాళ్ళది ప్రేమ, అందుకే కలుసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్’ అని డైలాగ్ వస్తుంటే స్క్రీన్ మీద అవికా గోర్ – రవితేజ మహాదాస్యం పెళ్లిని, మెంటల్ ఆస్పత్రిలో నందును చూపించారు. కథలో ట్విస్టులతో పాటు చివర్లో అవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అనేది సినిమాలో చూడాలని చిత్ర బృందం తెలిపింది.
థ్రిల్ చేసే ట్విస్టులు..
- Advertisement -
- Advertisement -