Wednesday, November 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సుప్రీంకోర్ట్ సీజేపై బూటు విసరడం అమానుషం

సుప్రీంకోర్ట్ సీజేపై బూటు విసరడం అమానుషం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
సుప్రీంకోర్టులో సీజేపై బూటు విసరడం అమానుషమని అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు సిటీమల  భరత్ కుమార్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులతో   మాట్లాడుతూ.. జడ్జిపైనే ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆ లాయర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బోర్లకుంట ప్రభుదాస్ మామిడిపల్లి  ఇందయ్య దుమల రమేష్, అజ్మీర నందు నాయక్  మహేష్ లక్ష్మణ్ ప్రవీణ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -