Sunday, May 11, 2025
Homeసినిమా'థగ్‌ లైఫ్‌' ఆడియో ఆవిష్కరణ వేడుక వాయిదా

‘థగ్‌ లైఫ్‌’ ఆడియో ఆవిష్కరణ వేడుక వాయిదా

- Advertisement -

కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ మణిరత్నం కాంబోలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. భారీ తారాగణంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా జూన్‌ 5న విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 16న భారీస్థాయిలో ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించాలని టీమ్‌ భావించింది. అయితే, ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుకను వాయిదా వేసినట్లు చిత్ర బందం తెలియ జేసింది. ఈ మేరకు కమల్‌హాసన్‌ ‘ఆర్ట్‌ కెన్‌ వెయిట్‌-ఇండియా కమ్స్‌ ఫస్ట్‌’ అంటూ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు.
‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దష్టిలో ఉంచుకుని, ఈనెల 16న నిర్వహించాల్సిన ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాము. మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహాత ధైర్యంతో ముందుండి పోరాడుతున్న వేళ ఇది వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయమని నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో సముచితమైన సమయంలో ప్రకటిస్తాం. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి’ అని కమల్‌హాసన్‌ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -