నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడుగా తుమ్మ బాలకృష్ణ ని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రకటించారు. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ భారతీయ జనతా పార్టీ గ్రామ అధ్యక్షుడిగా, భారతీయ రాష్ట్ర కిసాన్ మోస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతలను దివిజయంగా నిర్వహించినందుకు గాను తనకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని బాలకృష్ణ అన్నారు. స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షులుగా తుమ్మ బాలకృష్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES