Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతుమ్మిడికుంట చెరువును

తుమ్మిడికుంట చెరువును

- Advertisement -

పరిశీలించిన సీఎం

హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. హైటెక్స్‌లో జరుగుతున్న టెక్స్‌టైల్‌ సదస్సులో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో తుమ్మిడికుంటను సందర్శించారు. చెరువు చుట్టూ తిరిగి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణల కారణంగా తుమ్మిడికుంట చెరువు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చెరువుల పునరుద్దరణలో భాగంగా ఆక్రమణలను తొలగించి ఆ చెరువును 28.05 ఎకరాలకు విస్తరించారు. తుమ్మిడికుంట పునరుద్దరణ కోసం రూ. 20 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -