Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈదురుగాలులతో కూడిన వర్షం

ఈదురుగాలులతో కూడిన వర్షం

- Advertisement -

– పలుచోట్ల రైతుల హర్షం
– కొన్నిచోట్ల నేలకొరిగిన పంటలు
– నేడు, రేపు వర్షసూచన
నవతెలంగాణ-విలేకరులు

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు జల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిం చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, కాచిగూడ సహా పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. మెదక్‌ జిల్లా తొగుట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మండలంలోని ఘనపూర్‌, గుడికందుల, వరదరాజుపల్లి, వెంక ట్రావుపేట తదితరగ్రామాల్లో పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటలు నేల కొరిగినట్టు సమాచారం. కామారెడ్డి జిల్లా పిట్టం, అసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌, సిర్పూర్‌, తలమడుగు, ఆదిలాబాద్‌లోనూ చిరుజల్లులు కురిశాయి. కాగా, మంగళవారం, బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -