Wednesday, June 25, 2025
E-PAPER
Homeమానవిథైరాయిడ్‌.. ఏం తినాలి?

థైరాయిడ్‌.. ఏం తినాలి?

- Advertisement -

మారుతున్న జీవన శైలి, బిజీగా మారిన లైఫ్‌ స్టైల్‌, ఒత్తిడి లాంటి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్‌ సమస్యతో బాధ పడుతున్నారు. థైరాయిడ్‌ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్‌… అయితే ఎక్కువగా ఉత్పత్తి చేయడమో, లేకపోతే అస్సలు ఉత్పత్తి చేయకపోవడమో వల్ల ఇబ్బంది మొదలవుతుంది.
సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడమూ ఈ హార్మోన్‌ విడుదలలో హెచ్చు తగ్గులు రావడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా థైరాయిడ్‌ సమస్య ఉన్న వారు ఆహారంలో ఏం మార్పులు చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

హైపో థైరాయిడిజం… ఏం తినాలి ? ఏం తినకూడదు? :
థైరాయిడ్‌ గ్రంథి విడుదల చేయాల్సినదానికంటే తక్కువ హార్మోన్‌ని విడుదల చేస్తుంటే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆహారాన్ని క్రమబద్ధంగా తినాలి. ఒకసారి తినడం, ఒకసారి తినకపోవడం చేయకూడదు. అలాగే వీరు ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తినాలి. ఉసిరికాయలో సీ విటమిన్‌ ఉంటుంది. దీన్ని తీసుకోవడం మంచిది. ఎర్రగా ఉండే చేపలు, నట్స్‌, తాజా కూరగాయలు, పళ్లు తీసుకోవాలి.
ఈ సమస్య వున్నవాళ్లు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్‌, సోయ, పాలకూరలను తినకూడదు. వీటిలో ఉండే గోయిట్రోజెన్‌ సమస్యను మరింత పెంచుతుంది. అలాగే చిలకడ దుంపలు, స్ట్రాబెరీలు, పీచ్‌లు, వేరుశెనగలు, కొలస్ట్రాల్‌ స్థాయిలు ఎక్కువగా ఉండే రెడ్‌ మీట్‌ తినకూడదు.
హైపర్‌ థైరాయిడ్‌… ఏం తినాలి? ఏం తినకూడదు? :
థైరాయిడ్‌ గ్రంథి అవసరం అయిన దానికంటే ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంటే దాన్ని హైపర్‌ థైరాయిడిజం అని పిలుస్తుంటారు. వీరు ఎక్కువగా నీటిని తాగుతూ శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. నాన్‌ అయోడైజ్డ్‌ ఉప్పును మాత్రమే వాడాలి. తాజా పళ్లు, ఎగ్‌ వైట్స్‌ తినొచ్చు.
వీరు ముఖ్యంగా ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి. అయోడైజ్డ్‌ ఉప్పు తినడం మానేయాలి. నువ్వుల పొడిని తినకూడదు. హై కేలరీలు ఉండే స్వీట్లను తినకూడదు. పాలు, చీజ్‌, ఐస్‌ క్రీమ్‌లు, పెరుగు లాంటివి తినకూడదు. రైస్‌ కూడా తగ్గించాలి. ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ని తగ్గించాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. కెఫీన్‌ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. చేపలు, గుడ్డులో పచ్చసొన తినకూడదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -