Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వేలకు విరుద్ధంగా టికెట్ల కేటాయింపు

సర్వేలకు విరుద్ధంగా టికెట్ల కేటాయింపు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి అన్యాయం చేశారని, సర్వేలకు విరుద్ధంగా టికెట్లు కేటాయించారని మాజీ కౌన్సిలర్ వనం శేఖర్ ఆరోపించారు.  పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడరు. ఈ సందర్భంగా వనం శేఖర్ మాట్లాడుతూ.. సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని నమ్మించి, కేవలం డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని, తమలాంటి నాయకులకు అన్యాయం చేశారని అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి తమ సత్తా చూయిస్తామని పేర్కొన్నారు. హై కమాండ్ సైతం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ అగర్వాల్, కిరణ్, శరత్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -