Wednesday, July 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో స్థానికులకే టికెట్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో స్థానికులకే టికెట్‌

- Advertisement -

– బయటి వారు ఆశలు పెట్టుకోవద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ – జూబ్లీహిల్స్‌

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి స్థానికులకే టికెట్‌ ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అయితే టికెట్‌ ఎవరికివ్వాలన్న దానిపై సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఇంద్రానగర్‌లోని మండి హౌటల్‌లో మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నిక అనివార్యంగా రావడంతో పలువురు నేతలు తమకే టికెట్‌ వస్తుందని ప్రచారం చేస్తున్నారని, అటువంటి ప్రచారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి చెందిన వారే అభ్యర్థులుగా ఉండాలని, నియోజకవర్గ స్థానికులై ఉండాలని, రాజకీయంగా ప్రజల్లో ఉండే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి బయట ఉన్నవారు అనవసరంగా ఆశలు పెట్టుకొని ఓటర్లను గజిబిజి చేయొద్దని సూచించారు.
అన్ని సర్వేలూ పూర్తయిన అనంతరం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టికెట్‌ ఎవరికిచ్చినా, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెలవాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సమావేశానికి కాంటెస్టెడ్‌ మాజీ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, బాబా ఫసి ఉద్దీన్‌, భవానీ శంకర్‌ తదితర నేతలు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -