Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు అందుబాటులో టైడ్ డయాగ్నస్టిక్స్ సేవలు

ప్రజలకు అందుబాటులో టైడ్ డయాగ్నస్టిక్స్ సేవలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరింత చేరువలో తమ సేవలను విస్తృతం చేస్తున్నామని టైడ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్లు మోర్ సుభాష్, బిరెల్లి రుచిత లు తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని డిస్ట్రిక్ట్ కోర్ట్ లైన్, కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా సరస్వతి నగర్ ఖలీల్వాడి లో గల టైడ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో  ప్రయోగశాలలో (ల్యాబ్) పరీక్షలపై ప్లాట్ గా 30% తగ్గింపు కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేరుగా తమ సేవలను ప్రజలకు అందించేందుకే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో క్యాంపులు పెడుతూ తమ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు. కావున నిజామాబాద్ నగర ప్రజలు, జిల్లా ప్రజలు టైడ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో ప్రయోగశాల పరీక్షలపై ఫ్లాట్ 30% తగ్గింపు కార్డులను కేవలం 100 రూపాయలకు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాల పరీక్షలపై 30 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. తప్పనిసరిగా కార్డు ఉండాలని తెలియజేశారు. అలాగే ప్రజలకు అందుబాటులో తమ సేవలో భాగంగా ఉచిత ఇంటి సేకరణ అందుబాటులో ఉందన్నారు. ఇందుకోసం 8557878578, 8557979579 నంబర్లకు సంప్రదించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -