Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొల్లెపల్లి సమీపంలో పులి పాద ముద్రల కలకలం..

బొల్లెపల్లి సమీపంలో పులి పాద ముద్రల కలకలం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండల పరిధిలోని బొల్లెపల్లి గ్రామ సమీపంలో పులి కాలి ముద్రలు కలకలం రేపుతున్నాయి. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై డిఎఫ్ఓ పద్మజారాణిని వివరణ కోరగా అనుమానిత జంతువుగా గుర్తించినట్లు, ఆ గ్రామాల పరిధిలోని గ్రామస్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పులి సంచరిస్తున్నట్లు ఏవైనా ఆడవాళ్లు ఉన్నాయా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -