ఆ గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అటవీ శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత కొన్ని రోజులుగా ఆందోళనకు గురి చేస్తున్న పెద్దపులి పాదముద్రలు లభ్యమయ్యాయి. దీంతో సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి కదలికలపై అటవీ శాఖ పలు కీలక సూచనలను చేసింది. మహారాష్ట్ర పాండవఖారా డివిజన్ నుంచి వచ్చిన ఈ పెద్దపులి, 2025 నవంబర్ చివర్లో తెలంగాణలోకి ప్రవేశించి, కావల్ టైగర్ రిజర్వ్‌లో కొద్ది రోజులు గడిపిన అనంతరం ఇతర ప్రాంతాలకు కదులుతోంది.
శుక్రవారం ఉదయం రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామ శివార్లలో పెద్దపులి పాదముద్రలు లభ్యమవడంతో గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లవద్దనీ, అవసరమైతే గుంపులుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచించారు. రైతులు లైవ్ విద్యుత్ తీగలు పెట్టొద్దనీ, పశువులను షెడ్లలో కట్టాలని అటవీ శాఖ కోరింది. పశు నష్టం జరిగిన వారికి నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపింది. పెద్దపులి కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
రఘునాథపల్లిలో పెద్దపులి పాదముద్రలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


