- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం శివారు అడవుల్లో పులి సంచరిస్తున్నట్టు ఆ గ్రామ యువకులు తెలిపారు.శుక్రవారం ఉదయం గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో 9 గంటల సమయంలో పులి కనపడ్డట్టు ఆ గ్రామ ప్రజలు ఒకటే సారి ఉలిక్కిపడ్డారు. ఆ గ్రామ యువకులు అటవీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు పోలీసులు పులి ఆనావాలను పరిశీలించారు.ఈ గ్రామాలకు అనుకొని రాచకొండ ఫారెస్ట్ ఉండడంతో పులి సంచరిస్తున్నట్టు అక్కడ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఊరు మధ్యలోకి వచ్చినది పులి నా వేరే హైనా లాంటివి ఏదైనా ఉండవచ్చనె కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు
- Advertisement -

 
                                    