Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెద్దపులి సంచారం

పెద్దపులి సంచారం

- Advertisement -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆళ్ళపల్లి రేంజ్‌ అధికారి ఎన్‌.కిరణ్‌
నవతెలంగాణ-ఆళ్ళపల్లి

మండలంలో పెద్దపులి సంచరి స్తుందనే సమాచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆళ్ళపల్లి రేంజ్‌ పరిధిలోని చింతోళ్లగుంపు వెస్ట్‌ బీట్‌లోని లక్ష్మిపురం, పెద్ద వెంకటాపురం గ్రామాల మధ్య లోని ప్రధాన రహదారిపై వెళ్తున్న రైతులకు పులి పాద ముద్రలు కనిపించాయి. వెంటనే ఆ రైతులు సంబంధిత ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సెక్షన్‌ ఆఫీసర్‌ సురేష్‌ తమ సిబ్బందితో లక్ష్మిపురం గ్రామ సమీపానికి చేరుకొని పులి పాదముద్రలు సేకరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రేంజర్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. రేగళ్ల రేంజ్‌ పరిధి నుంచి పెద్దపులి పిల్ల ఆళ్ళపల్లి రేంజ్‌ పరిధిలోకి వచ్చిందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -