Wednesday, January 21, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం

అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం

- Advertisement -

– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– పోలీసులు హెచ్చరిక
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌.హెచ్‌.ఓ ఎస్‌.ఐ యయాతి రాజు హెచ్చరించారు. సోమవారం రాత్రి పులి సంచరించినట్లు అనుమానిస్తున్న ప్రాంతాలను ఆయన బుధవారం స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కావడిగుండ్ల సమీప అటవీ ప్రాంతంలో పులి ఆవులపై దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నట్లు, అలాగే పులి అడుగుజాడలు గుర్తించినట్లు అటవీ అధికారులు తమకు తెలియజేశారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించకూడదని సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు నిఘా పెంచినట్లు తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -