Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగంగారం తండాలో పెద్దపులి సంచారం

గంగారం తండాలో పెద్దపులి సంచారం

- Advertisement -

– రెండ్రోజుల్లో రెండు ఆవులను చంపిన పులి
నవతెలంగాణ – కొడిమ్యాల

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారం తండా పరిధిలో పెద్దపులి సంచారం గ్రామస్తులను వణికిస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ తండాలో 48 గంటల్లోనే పెద్దపులి రెండు ఆవులను చంపి తినడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అడవికి ఆనుకుని ఉన్న తండా శివారులో మేత కోసం కట్టేసిన ఒక ఆవుపై ఆదివారం పెద్దపులి దాడి చేసి చంపి తిన్నది. సోమవారం మరో ఆవును కూడా పులి చంపడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గంగారం తండా సహా సమీప గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడుగుజాడలను సేకరించిన అధికారులు, అది పెద్దపులిగానే ప్రాథమికంగా నిర్ధారించారు. వన్యప్రాణి నిపుణులను రప్పించి, పులి కదలికలను ట్రాక్‌ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని, పశువులకాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారి మొయినుద్దీన్‌ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -