Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅరేపల్లి సమీపంలో పులి జాడలు

అరేపల్లి సమీపంలో పులి జాడలు

- Advertisement -

అప్రమత్తమైన అటవీ శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సిద్ధిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. నిన్న పులి కనిపించిన ప్రాంతానికి వాయువ్య దిశగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో తాజా పాదముద్రలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్‌ చర్యలను మరింత ముమ్మరం చేశారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్య వేక్షణ కోసం థర్మల్‌ ఇమేజింగ్‌ డ్రోన్లను వినియోగిస్తున్నారు. పుణె నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోంది. గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలను విస్తరించి, ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -