Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలలో పులి సంచారం...

రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలలో పులి సంచారం…

- Advertisement -

– టేకుమట్ల ఎస్సై దాసరి సుధాకర్…
నవతెలంగాణ- టేకుమట్ల

రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలలోని గ్రామాలలో పులి సంచారం చేస్తుందని ఫారెస్ట్ అధికారులు తెలపడంతో పలు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. చిట్యాల మండలంలోని జడలపేట్ గ్రామ శివారు భీష్మనగర్ ప్రాంతంలో మేతకు వెళ్లిన దుక్కిటేద్దును  పులి దాడిచేసి కొరికి చంపేసినట్లు ఎస్సై తెలిపారు. చిట్యాల, టేకుమట్ల మండలంలోని గ్రామాల ప్రజలు వ్యవసాయ భూముల వద్దకు, మానేరు వాగు పరివాహ ప్రాంతాలకు, ముఖ్యంగా పశువుల కాపర్లు పశువులను అడవికి తీసుకవెళ్లద్దని, ఎవరు ఒంటరిగా  వెళ్లకూడదని, ప్రజలు కొన్ని రోజుల వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో రాత్రిపూట ప్రజలు తిరగవద్దని, పులి కదలికలు గుర్తించినట్లయితే పోలీసు అధికారులకు తెలిపాలని  ఎస్సై సుధాకర్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -