నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు రేపు జరగనున్నాయి. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆదేశాలకు వ్యతిరేకంగా యువత దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ నిరసనల్లో దాదాపు 15 వందల మంది చనిపోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు సంవత్సరన్నర తర్వాత బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 50 శాతం పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అలాగే ఆ దేశ రాజధాని ఢాకాలో పోలీసులు కెమెరాలు ధరించి భారీగా మోహరించారు. దాదాపు 90 శాతం బూత్‌లు సిసిటివిల పర్యవేక్షణలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ ఎన్నికలు బంగ్లా దేశ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు జరగని విధంగా జరగనున్నాయి. ఈ ఎన్నికల సందర్బంగా ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు భారీస్థాయిలో పోలీసులు మోహరించనున్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించనున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసుల్ని కోరామని ఎన్నికల కమిషనర్ అబ్దుల్ ఫజల్ మొహమ్మద్ సనావుల్లా తెలిపారు.
రాజధాని ఢాకాలో 2,131 పోలింగ్ కేంద్రాల్లో.. 1,614 కేంద్రాలు హై రిస్క్‌గా ఉన్నట్లు గుర్తించామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ బహరుల్ ఆలం అన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరపడానికి దేశవ్యాప్తంగా దాదాపు 958,000 మంది పోలీసులు మోహరించినట్లు ఎన్నికల కమిషనర్ అబ్దుల్ ఫజల్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో రేపే ఎన్నికలు..పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



