జిల్లా ఎస్పీ జానకి షర్మిల
నవతెలంగాణ – ముధోల్
రేపు బాసరలో జరగనున్న వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం బాసర జిఎస్ఆర్ గార్టెన్ లో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు.వసంత పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున,ఆలయ పరిసర ప్రాంతాల్లో, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రత్యేకంగా పోలీసు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.
భక్తులభద్రతేప్రధానలక్ష్యంగాబారికేడింగ్,క్యూలైన్లు,పార్కింగ్ ఏర్పాట్లు, లడ్డు కౌంటర్ల వద్ద రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ముందుగానే సిద్ధం చేసినట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, సాదా దుస్తుల్లో పోలీసులు, కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించినా, వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా, నిర్మల్ ఏ ఎస్పీ రాజేష్ మీనా,సాయికిరణ్,సిఐలు, ఎస్ఐ లు, పోలిస్ సిబ్బంది, పాల్గొన్నారు.



