Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు: సీపీ

సీఎం పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు: సీపీ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం శ్రావ్య గార్డెన్లో సిబ్బందితో తమ తమ విధుల నిర్వహణ కోసము ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని , సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసిన త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని, ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలియజేయడం జరిగింది. అనునిత్యము సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు. ఈ బందోబస్తుకు 600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సిసిఎస్, సి టి సి, ట్రాఫిక్ ఏసిపి లు రాజా వెంకటరెడ్డి,  వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ నాగేంద్ర చారి, రాజశేఖర్, మస్తాన్ అలీ మరియు సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -