Tuesday, February 3, 2026
E-PAPER
Homeనిజామాబాద్కామారెడ్డి మున్సిపల్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

- Advertisement -

– కామారెడ్డి మున్సిపల్ ను పరిశీలించిన ఎస్పీ
 నవతెలంగాణ – కామారెడ్డి 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, రూరల్ ఇన్‌స్పెక్టర్ రామన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఎస్‌ఐలు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్  తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -