బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గిద్ద మాజీ సర్పంచ్ ప్రభు లింగం ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందగా బాధిత కుటుంబాన్ని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా అందజేశారు. అనంతరం మద్దికుంట శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారి జంగం ప్రభాకర్ మాతృమూర్తి మృతి చందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు నిశాంత్, కనుగందుల నవీన్ తదితరులు ఉన్నారు.

Spread the love