Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

- Advertisement -

మెంట్రాజ్ పల్లిలో ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం..
క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ & ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్. అజ్జ శ్రీనివాస్.. మెడికల్ కాలేజ్  చైర్మన్ డా. షణ్ముగమ్ మహలింగం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: తెలంగాణలో మళ్లీ కొవిడ్( కరొనా) వైరస్  వ్యాపిస్తున్నదని, వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధ, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనె సమీప వైద్యులను సంప్రదించి వైరస్ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డెంగీ, మలేరియా సీజనల్ వ్యాధులు విజృంబించె సమయంలో దృడ సంకల్పంతో మెంట్రాజ్ పల్లి  గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందించ దగిన విషయమని క్రిష్టియన్ మెడికల్ కాలేజ్  చైర్మన్ డా. షణ్ముగమ్ మహలింగం,క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ & ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్. అజ్జ శ్రీనివాస్ అన్నారు. శనివారం క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ & ఆసుపత్రి డిచ్పల్లి వారి  ఆధ్వర్యంలో ఐఎంఎ నిజామాబాద్  వారి సహకారంతో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు  మండలంలోని మెంటాజ్ పల్లి గ్రామం లోని గ్రామ పంచాయతీ లో గ్రామీణ ప్రజలకు  ఉచిత మెఘ వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహంచారు.ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా  క్రిష్టియన్ మెడికల్ కాలేజ్  చైర్మన్ డా. షణ్ముగమ్ మహలింగం హాజరై  మాట్లాడుతూ  క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ వైద్యులు,ఐఎంఎ వారి సహకారంతో డెంగీ, మలేరియా సీజనల్ వ్యాధులు విజృంబించె సమయంలో దృడ సంకల్పంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం ఎంతో ముందు చూపుతో కూడుకున్నదని వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.  సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి  జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టరు & ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్. అజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. త్వరలొ క్రిష్టియన్ మెడికల్ కాలేజ్, ఆసుపత్రి లో  వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆసుపత్రి లో వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వివిధ రకాల స్పెషలిస్టు వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా 30 వేల విలువ గలగల మందులు పంపణి చేశారు.ఈ కార్యక్రమంలో మత్తు వైద్యులు డాక్టర్. పాండు, డాక్టర్. మోతీలాల్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్. ప్రతిభ,  దంత వైద్యులు  డాక్టర్. శిల్ప, మానసిక వైద్యులు డాక్టర్. వికాస్, కంటి వైద్యులు డాక్టర్. సుప్రజ, జనరల్ మెడిసిన్ డాక్టర్. హనిశ్, పిల్లల వైద్యులు డాక్టర్. శ్రీధర్, మత్తు వైద్యులు డాక్టర్. విశాల్,  ల్యాబ్ టెక్నీషియన్లు,ఆరోగ్య కార్యకర్తలు, బారి సంఖ్యలో రోగులు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -