Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్జై జవాన్, జై కిసాన్ నినాదాలతో మారుమోగిన తిలక్ గార్డెన్

జై జవాన్, జై కిసాన్ నినాదాలతో మారుమోగిన తిలక్ గార్డెన్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ లో శుక్రవారం ఉదయం తాటి మణెమ్మ రాములు ఫౌండేషన్ టి ఎం ఆర్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో నిజామాబాద్ తిలక్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ యోగ సభ్యుల సహకారంతో సైనికులకు వందనం రైతులకు నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.జై జవాన్ జై కిసాన్ నినాదాలతో తిలక్ గార్డెన్ మారుమోగింది. దేశ రక్షణలో ఆర్నిశలు కాపలా కాసే నలుగురు సైనికులకు, మానవాళికి ఆహారాన్ని అందించే రైతన్నలకు ఘనంగా సన్మానం చేశారు. సైనికులుగా పనిచేసి విశ్రాంత జీవనంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎడమ కంటి రాంరెడ్డి,  సూరహర ప్రసాద్,  దాసరి బాబు, బన్నీ రూపేష్ లను, భూమాతను నమ్ముకుని వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఆదర్శ రైతు పోత రెడ్డి ని టిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ తాటి వీరేశం, కో చైర్మన్ తాటి అశోక్ కుమార్, సెక్రెటరీ తాటి సత్యనారాయణ,  తాటి లత తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తిలక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తులగంగాధర్ అడ్వకేట్ , సభాధ్యక్షులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ముక్కా దేవేందర్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్మన్  హాజరైనారు. డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సైనికుల సేవల గురించి ప్రశంసించారు. ముక్కా దేవేందర్ గుప్తా జై జవాన్ జై కిసాన్ కార్యక్రమం ప్రాధాన్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్సి విజయకుమార్ గుప్త, ఉప్పల నర్సింగ్ రావు, మీ బాశెట్టి విశ్వనాథం గుప్తా,  గాదె సుదర్శన్ గుప్తా, డాక్టర్ పి.బి కృష్ణమూర్తి,  టి ఆర్ విశ్వనాథం గుప్తా, జి రాజశేఖరం గుప్తా,  బాలరాజు,  ఎర్ర సూర్యనారాయణ గుప్త, జగన్,  చల్లా గంగాధర్ గుప్తా,  బండారి దత్తాత్రి,  చిదుర రాజుగారు, గంగిశెట్టి,  బోసు బాబు, గజవాడ ధర్మరాజు,  పి. పెంటయ్య గుప్తా, కుర్షిద్ , అఖతర్,  ముంతాజ్  హాజరై సైనికులకు అభినందించారు. మహిళలు, బాల,బాలికలు వాకర్స్ అసోసియేషన్ నుండి సుమారు వందమంది హాజరై వందేమాతరం నినాదాలతో సభ మారు మ్రోగింది. ఈ సందర్భంగా  వక్తలు మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించే సైనికుల గురించి అదే విధంగా రైతన్నల సేవల గురించి కొనియాడారు. జై జవాన్ జై కిసాన్ వందేమాతరం నినాదాలు చేస్తూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -