- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీమ్ ఇండియా ఆటగాడు తిలక్ వర్మ. టీ20 ప్రపంచ కప్-2026 గెలుచుకుని హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీం ఇండియా ఆటగాడు తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, శాట్ తెలంగాణ చైర్మెన్ శివసేనారెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



