Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆటలుకౌంటీల్లో ఆడనున్న తిలక్‌ వర్మ

కౌంటీల్లో ఆడనున్న తిలక్‌ వర్మ

- Advertisement -

లండన్‌: టీమిండియా బ్యాటర్‌, హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడనున్నాడు. డివిజన్‌-1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌కు తిలక్‌ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సిఎ) బుధవారం తెలిపింది. ”యూకే కౌంటీ ఛాంపియన్‌షిప్‌ లీగ్‌లో ఆడేందుకు హాంప్‌షైర్‌ కౌంటీ జట్టుతో హైదరాబాద్‌ ఆటగాడు ఎన్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని” హెచ్‌సిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. 22 ఏళ్ల తిలక్‌ వర్మ జూన్‌ 18 నుండి ఆగస్టు 2 వరకు హాంప్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. హాంప్‌షైర్‌ తరఫున నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు తిలక్‌ వర్మ ఆడనున్నాడు. ఇప్పటివరకు 18 ఫస్ట్‌ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ వర్మ.. 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు వన్డేలు, 25 టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా అతడికి టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. 24 ఇన్నింగ్స్‌లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు. మరోవైపు రుతురాజ్‌ గైక్వాడ్‌ సైతం యార్క్‌షైర్‌ క్లబ్‌ తరపున కౌంటీ క్రికెట్‌ ఆడనున్నాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad