- Advertisement -
న్కూయార్క్ : దిగ్గజ టెక్, ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆ సంస్థను వీడనున్నారని తెలుస్తోంది. ఈ నెలలో 65 ఏండ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆపిల్ కీలక బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని రిపోర్టులు వస్తోన్నాయి. దీంతో టిమ్ కుక్ తర్వాత ఆపిల్‌కు తదుపరి సీఈఓ ఎవరేనేది ఆ పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న జాన్ టర్నస్ సీఈఓ రేసులో ఉన్నారని వినిపిస్తోంది. జాన్ ప్రస్తుతం ఆపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 24 సంవత్సరాలుగా జాన్ ఆపిల్‌లో పలు కీలక పదవులను చేపట్టారు.
- Advertisement -



