Tuesday, January 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కవ్వాల్ టైగర్ జోన్ లో పులుల గణనకు వేళాయె..

కవ్వాల్ టైగర్ జోన్ లో పులుల గణనకు వేళాయె..

- Advertisement -

కొనసాగుతున్న  పులుల గణన..
అఖిల భారత పులుల గణన- 2026 ప్రారంభం..
జన్నారం డివిజన్లోని 40 బీట్లలో ఆరు రోజుల పాటు సర్వే
పాల్గొంటున్న అటవీ అధికారులు, స్వచ్ఛంద వాలంటీర్లు
నవతెలంగాణ – జన్నారం

వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అఖిల భారత పులుల గణన-2026 కార్యక్రమానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ కొనసాగుతోంది. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో  (జనవరి 20) నుంచి 25వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఈ గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు జన్నారం అటవీ మండలాధికారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జన్నారం అటవీ డివిజన్ లోని డివిజన్ లోని  ఇందనపల్లి, జన్నారం, తాళ్లపేట రేంజ్ పరిధిలోని మొత్తం 40 అటవీ బీట్లలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఈ ఆరు రోజుల ప్రక్రియలో అటవీ అధికారులు కేవలం పులులనే కాకుండా అడవిలోని జీవవైవిధ్యాన్ని సమగ్రంగా రికార్డు చేయనున్నారు. గణనలో భాగంగా మాంసాహారజంతువుల ఉనికిని గుర్తించేందుకు ప్రతి బీటులో అధికారులు 15 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణిస్తారు.

ఈ సమయంలో జంతువుల పాద ముద్రలు, మలం ఆధారంగా వాటి సంచారాన్ని గుర్తిస్తారు. అలాగే జింకలు, దుప్పుల వంటి శాఖాహార జంతువులను లెక్కించేందుకు ‘లైన్ ట్రాన్సెక్ట్’ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2 కిలోమీటర్ల సరళ రేఖ మార్గంలో 3 రోజుల పాటు 6 సార్లు (మొత్తం 12 కిలోమీటర్లు) నడిచి జంతువుల సంఖ్యను అంచనా వేస్తారు. వీటితో పాటు అడవిలోని చెట్లు, పొదలు, గడ్డి జాతులు, రాబందులు, ఇతర పక్షి జాతుల వివరాలను కూడా క్షుణ్ణంగా నమోదు

చేస్తారు. ఈ గణన కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులైన ఎఫ్.ఆర్.ఓలు, డి.వై.ఆర్.ఓలు, ఎఫ్.ఎస్.ఓలు, ఎఫ్.బి.ఓలతో పాటు టైగర్ ట్రాకర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. వీరితో పాటు హైదరాబాద్ వంటి నగరాల నుండి వచ్చిన పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి ఆసక్తి గల స్వచ్ఛంద వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వాలంటీర్లందరికీ వారి వారి ఆసక్తిని బట్టి వివిధ రేంజ్లను కేటాయించారు. వన్యప్రాణుల సంరక్షణలో అత్యంత కీలకమైన ఈ కార్యక్రమానికి మీడియా, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

పులుల గణను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం: ఎఫ్డిఓ మాధవరావు
జాతీయ పులుల గణనను పగడ్బందీగా నిర్వహిస్తున్నాం. టైగర్ జోన్ లోని మూడు రేంజ్ కార్యాలయాల పరిధిలో ఉన్న అడవులలో అటవీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఈ గణనను పూర్తి చేయనున్నము. ఈ ఘనన ఆరు రోజులు కొనసాగనుంది.. అనంతరం పూర్తిస్థాయిలో అడవులలో ఎన్ని జంతువులు ఉన్నాయో లెక్కను తెలియపరుస్తాం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -