- Advertisement -
- – పానీపూర కేంద్రం రేడియాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ సింగ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ - సకాలంలో ఉచితంగా నాణ్యమైన స్కానింగ్ వైద్య పరీక్షలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ డయాగ్ని స్టిక్స్ పానీపూర కేంద్రం రేడియాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ సింగ్ అన్నారు. పానీపూర కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తమ కేంద్రంలో నాణ్యమైన స్కానింగ్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
ఎక్స్-రే వైద్య పరీక్షలు.. - ఎక్స్ – రే శరీరంలోని ఎముకలు, కండరాలు వంటి అంతర్గత నిర్మాణాల చిత్రాలను రూపొందించడానికి తక్కువ మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్ ను ఉపయోగించే ఒక సాధారణ వైద్య నిర్దారణ పరీక్ష. ఈ పరీక్ష నొప్పిలేకుండా ఉంటుంది విరిగిన ఎముకల పరిస్థితి & టీబీ,ఆస్తమా, నీమోనియా తెలుస్తుందన్నారు.
ఈసీజీ వైద్య పరీక్షలు.. - “ఈసీజీ” అనేది ఎలక్ట్రో కార్డియోగ్రామ్ యొక్క సంక్షిప్త రూపం. ఇది గుండె యొక్క విద్యుత్ చర్యలను కొలిచే ఒక పరీక్ష. (చాతి నొప్పి కి ఇది ప్రమాణికం. హార్ట్ ఎటాక్ కి)ఈ పరీక్ష గుండె యొక్క లయ, రిథమ్ ని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. & గర్భిణీలకు స్కానింగ్ లు అన్ని ఇక్కడ చేస్తారు.
- టి ఫా స్కానింగ్ వైద్య పరీక్షలు..
- గర్భిణీలకు టిఫా స్కాన్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. టీపా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ దీనిని పిండం క్రమరాహిత్యాల కోసం టార్గెటెడ్ ఇమేజింగ్ స్కాన్ అని కూడా అంటారు. ఇది గర్భధారణ సమయంలో చేసే ముఖ్యమైన అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇది గర్భస్థ శిశువు ఎదుగుదలను, శరీర నిర్మాణాన్ని సమగ్రంగా పరిశీలిస్తుంది మరియు ఏదైనా పుట్టుకతో వచ్చే అసాధారణతలను (అనొమలీలను) గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ పరీక్ష 18 నుండి 22 వారాల మధ్య వైద్యుల సిఫారసు తో నిర్వహిస్తామన్నారు.
- టిఫా స్కాన్ యొక్క ప్రాముఖ్యత..
- పుట్టుకతో వచ్చే లోపాల గుర్తింపు: శిశువుకు ఏదైనా గుండె, మెదడు, వెన్నెముక లేదా ఇతర అవయవాలకు సంబంధించిన పుట్టుకతో వచ్చే అసాధారణతలు ఉన్నాయేమో గుర్తించవచ్చు అన్నారు.
- కిడ్నీ వైద్య పరీక్షలు..
- కిడ్నీ స్కానింగ్ (మూత్రపిండాలు) స్కానింగ్ మూత్రపిండాల పనితీరు నిర్మాణం పరిశీలించడానికి టెస్ట్ అన్నారు. మూత్రపిండల పనితీరు, మూత్రపిండాల్లో రాళ్లు గుర్తించడానికి ఈ స్కానింగ్ ద్వారా బయటపడుతుందన్నారు. అఫెండెకస్ స్కానింగ్ చేస్తాము అన్నారు..తమ కేంద్రాం లో రోజుకు దాదాపు 15 ఎక్స్ -రే లు, ఈసీజీలు 10, స్కానింగ్ -30 , టీపా స్కానింగ్ లు టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. తమ కేంద్రానికి సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి, బస్తి దవాఖానాల నుంచి, నాంపల్లి & గోల్కొండ ఏరియా హాస్పిటల్ నుంచి, ఉస్మానియా, గాంధీ, ప్లేట్లు బూర్జు (జజ్జికాన మీటర్నిటీ) ఆసుపత్రి నుండి రోగులు వైద్య పరీక్షల కోసం వస్తారని తెలిపారు . 2020 నుండి ఇప్పటివరకు 30 వేల పేద రోగులకు వివిధ రకాల నాణ్యమైన వైద్య పరీక్షలు, స్కానింగ్ లు నిర్వహించామన్నారు ఈ ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి రాజా సురేష్, ఎక్స్ – రే టెక్నీషియన్ శ్రీనివాస్ చారి , డాటా ఎంట్రీ ఆపరేటర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -