Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనీమియా బాధితురాలికి సకాలంలో రక్తదానం

అనీమియా బాధితురాలికి సకాలంలో రక్తదానం

- Advertisement -

– రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పద్మ (41) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన లింగంపేట్ మండలం భవానిపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కొండ శ్రీనివాస్ గౌడ్ ఎనిమిదవ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉన్నదని అన్నారు. గతంలో గర్భిణీ స్త్రీల కోసం, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాత శ్రీనివాస్ గౌడ్ కి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -