Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చిలో సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం

మార్చిలో సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం

- Advertisement -

– 12 నుంచి విధుల్లోకి వంద మంది వైద్య సిబ్బంది
– ఆస్పత్రి సందర్శనలో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధానకార్యదర్శి వికాస్‌రాజ్‌
– 28 కల్లా అన్నిపనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రి ని మార్చిలో ప్రారంభించబోతున్నట్టు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ శుక్రవారం తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌, సనత్‌నగర్‌) ఆస్పత్రి ప్రాంగణాన్ని సంద ర్శించారు. వైద్య విద్యా డైరెక్టర్‌ నరేంద్రకుమార్‌, టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ, ఎమ్‌హెచ్‌ఐడీసీ అధికారులు, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, ఈపీసీ కాంట్రాక్టర్‌ మెగా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రతిని ధులతో కలిసి అన్ని అంతస్తులలో కొనసాగుతున్న పనులు సమీక్షించారు. ఎమర్జెన్సీ విభాగం, ఆపరే షన్‌ థియేటర్లు, ఐసీయూలు, సెంట్రల్‌ స్టెరైల్‌ సర్వీసెస్‌ విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఫిబ్రవరి 28లోగా మిగిలిన అన్ని సివిల్‌, మౌలిక వసతుల పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఎమర్జెన్సీ విభాగానికి అవసరమైన 200 ఆక్సిజన్‌ లైన్లు, 65 నర్సింగ్‌ స్టేషన్లు, రిజిస్ట్రే షన్‌ కౌంటర్లు, ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేసి వెంటనే ట్రయల్‌ రన్స్‌ నిర్వహించాలని సూచించారు. లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ బెడ్‌ రైలింగ్స్‌, ఆస్పత్రి అంతటా సైన్‌బోర్డుల ఏర్పాటు వంటి సహాయక వసతులను ఈ నెలాఖరులోగా సిద్ధంచేయాలని ఎమ్‌హెచ్‌ఐడీసీకి స్పష్టం చేశారు. ఈపీసీ పరిధిలోని వైద్య పరికరాలన్నీ ఇప్పటికే అమర్చినట్లు కాంట్రాక్టర్‌ వెల్లడించగా, మొత్తం 540 వైద్య, అనుబంధ పరికరాల కొనుగోలు ప్రక్రి య కొనసాగుతోందని ఎమ్‌హెచ్‌ఐడీసీ అధికారు లు వివరించారు. ఆస్పత్రి కార్యకలాపాల ప్రారంభా నికి ముందుగా పరికరాల పరీక్షలు, ట్రయల్‌ రన్స్‌ నిర్వహించేందుకు వైద్య, సాంకేతిక సిబ్బందిని వెంటనే నియమించాలని వైద్య విద్యా డైరెక్టర్‌ను వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఫిబ్రవరి 12 నుంచి 28 మధ్య తొలి దశలో 100 మంది వైద్య, పారా వైద్య, హౌస్‌కీపింగ్‌ సిబ్బందిని విధుల్లోకి తీసుకురాను న్నట్లు అధికారులు తెలిపారు. నెలాఖరుకు పూర్తి సిబ్బంది నియామకం పూర్తవుతుందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -