Tuesday, December 9, 2025
E-PAPER
Homeక్రైమ్బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌

- Advertisement -

– అక్కడికక్కడే ర్యాపిడో డ్రైవర్‌, మహిళ మృతి
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌

టిప్పర్‌ ఢీకొట్టడంతో ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌తోపాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన కావరెడ్డి శ్రీకాంత్‌, జ్యోతి(32) దంపతులు. సూరారం వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు సూరారం జ్యోతి మిల్క్‌ కంపెనీ ఎదురుగా కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం శ్రీకాంత్‌ కూరగాయలు తేవడానికి షాపూర్‌నగర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. జ్యోతి దుకాణం తెరిచేందుకు ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరింది. బైక్‌ మిల్క్‌ కంపెనీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ అదుపుతప్పి బలంగా వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో ఆమెతోపాటు రాపిడో డ్రైవర్‌ సాయిబాబా నగర్‌ పాండు బస్తీకి చెందిన కె.సురేందర్‌ రెడ్డి(45) అక్కడికక్కడే మృతిచెందారు. సూరారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -