– అన్ని నియోజకవర్గాల్లోనూ యాత్రలు : డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆపరేషన్ సిందూర్ విజయవంతాన్ని పురస్కరించుకుని సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత జవాన్ల వీరోచిత పోరాటానికి సెల్యూట్ చేస్తూ తెలంగాణ సిటిజన్స్ ఫోరం ఫర్ నేషనల్ సెక్యూరిటీ సంస్థతో కలిసి ఈ నెల 17 నుంచి 23 వరకు రాష్ట్రంలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటే శ్వర్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం మొత్తం ఉద్వేగ వాతావరణంలో ఉండగా ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పారు. ప్రధాని మోడీ రాత్రీపగలు సమీక్షలు నిర్వహించి ఆర్మీకి, అధికారులకు స్పష్టమైన మార్గదర్శనం అందించారని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో 26 నిమిషాల్లో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఘనత మన సైన్యానికి దక్కుతుందని కొనియాడారు. సైన్యం దెబ్బకు అమె రికా దగ్గర పాకిస్తాన్ ప్రభుత్వం మోక రిల్లి శరణు గోరిందనీ, యుద్ధం వద్దని ప్రధాని మోడీని వేడుకు న్నదని చెప్పారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 17 సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవు తుందనీ, 18, 19, 20 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో, 21, 22, 23 తేదీల్లో మున్సిపాలిటీలు, అసెంబ్లీ నియోజక వర్గాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తా మని ప్రకటించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఎస్. ప్రకాష్ రెడ్డి, మాధవి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్, అమర్ నాథ్ సారంగుల పాల్గొన్నారు.
17 నుంచి 23 వరకు తిరంగా యాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES