Monday, February 16, 2026
E-PAPER
Homeఆటలునరసింహారెడ్డి, నీలకంఠ జోడీకి టైటిల్‌

నరసింహారెడ్డి, నీలకంఠ జోడీకి టైటిల్‌

- Advertisement -

ముగిసిన హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

హైదరాబాద్‌ : నాలుగు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన 23వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆదివారం ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 300 మందికి పైగా క్రీడాకారులు పోటీపడగా.. పురుషుల 55 ప్లస్‌ డబుల్స్‌ విభాగంలో నంద్యాల నరసింహారెడ్డి (తెలంగాణ), నీలకంఠ దమ్రె (గోవా) జోడీ విజేతగా నిలిచింది. 55 ప్లస్‌ సింగిల్స్‌ విభాగంలో ఐపీఎల్‌ ఆఫీసర్‌ సీవీ ఆనంద్‌ 6-2, 6-3తో నీలకంఠ దమ్రెపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచాడు.

జూబ్లిహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన ఫైనల్లో లగడపాటి శ్రీధర్‌, శ్రీనాథ్‌లపై నరసింహారెడ్డి, నీలకంఠలు 6-4, 6-7, 13-11తో ఉత్కంఠగా సాగిన మూడు సెట్ల సమరంలో పైచేయి సాధించి టైటిల్‌ సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఓటీఏ) అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి, ఐపీఎల్‌ ఆఫీసర్‌ పివి పద్మజ, అర్బన్‌రైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర దేశారు, జూబ్లిహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ కార్యదర్శి జగ్గారావు, స్పోర్ట్స్‌ కన్వీనర్‌ సురేశ్‌ రెడ్డిలతో కలిసి హెచ్‌ఓటీఏ ఆఫీస్‌ బేరర్లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -