Wednesday, May 21, 2025
Homeకరీంనగర్తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలక పాత్ర..

తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలక పాత్ర..

- Advertisement -
  • – టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది…
    నవతెలంగాణ – వేములవాడ 
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31 న టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజతోత్సవ పోస్టర్ ను మంగళవారం వేములవాడలో రవాణా,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను, విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు.అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో మాక్ అసెంబ్లీ, ఛలో ఢిల్లీ,సాగర హారం, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలను చేసిన ఘనత టీజేఎఫ్ దక్కిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, ఎలక్ట్రానిక్ మీడియా టెంజు అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, సీనియర్ పాత్రికేయులు గరుదాసు ప్రసాద్, సయ్యద్ అలీ,దేవరాజ్, దెబ్బేటి ప్రవీణ్, నాగరాజు, ప్రసాద్, సాయి, సోహెల్, హరీష్, జబ్బార్, తో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులతోపాటు తదితరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -