నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) మద్దతు తెలిపింది. ఈ మేరకు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మంగళవారమొక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వీటిని తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం పెద్ద కార్పొరేట్ సంస్థలను లబ్ది చేకూర్చే విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టీజేఎస్ క్రియాశీలకంగా పాల్గొంటుందని తెలిపారు. సింగరేణి కార్మిక సంఘం, మున్సిపల్, ఇతర అనుబంధ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో చురుకుగా పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తాయని పేర్కొన్నారు.
సార్వత్రిక సమ్మెకు టీజేఎస్ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



