Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం

టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని టి ఎన్ జి ఓ ఎస్ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలపై సభ్యులందరూ మాట్లాడిన అనంతరం సుమన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ పాత్రికేయులు స్వర్గీయ  అందేశ్రీ , టీఎన్జీవో మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు మంజుల  మాతృమూర్తి యశోద, ఇటీవలే అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులైన మెడికల్ అండ్ ఫోరం జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్, పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం లో 2 నిమిషాలు మౌనం పాటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి స్మరించుకున్నారు.

అనంతరం కాల పరిమితి (టెన్యూర్ పీరియడ్) దాటిన అన్ని శాఖల ఫోరం లకు ఎన్నికలు సత్వరమే నిర్వహించుకోవాలని, టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈనెల 22వ తేదీన టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షులు  మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం హుస్సేని (ముజీబ్) ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో… టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో నిర్వహించబడుతున్నందున  అన్ని శాఖల ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించాలని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జిల్లా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు ఉద్యోగులందరూ కలిసి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, కోశాధికారి దినేష్ బాబు టీఎన్జీవో వివిధ యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, జ్ఞానేశ్వర్ రెడ్డి, శశికాంత్ రెడ్డి, ప్రవీణ్ రాజ్, సృజన్ కుమార్, మారుతి, శ్రీనివాస్, విశాల్, సాయిలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు అతిక్, కే పి సునీత, మంజుల, శ్రీనివాస్, మాణిక్యం ,శివకుమార్, సంయుక్త కార్యదర్శులు జాఫర్ హుస్సేన్, మహేందర్, విశాల్ రెడ్డి, పద్మ, ఇందిర, గంగరాజు, ప్రచార కార్యదర్శి ప్రకాష్, నటరాజ్, సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ గౌడ్, ఆఫీస్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గేమ్స్ సెక్రటరీ గురుచరణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు భూమయ్య, విజయలక్ష్మి ,సునీల్, స్వామి, టిఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -