Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 30న జడ్చర్లలో టీఎన్జీవో ఎన్నికలు 

ఈనెల 30న జడ్చర్లలో టీఎన్జీవో ఎన్నికలు 

- Advertisement -

టీఎన్జీవో తాలూకా అధ్యక్షులు తిరుపతయ్య 
నవతెలంగాణ – మిడ్జిల్ 

జడ్చర్ల పట్టణంలో ఈనెల 30న టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 2026-2029 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో జడ్చర్ల తాలూకా అధ్యక్షులు కే తిరుపతయ్య, ఎన్నికల అధికారి యుగంధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ టీఎన్జీవో జిల్లా యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఓటర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఎన్నికలు ఉద్యోగుల హక్కులు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్న ముఖ్యమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.

మార్చి 30న జరగనున్న ఎన్నికల కార్యక్రమాలను ప్రతి ఉద్యోగి సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నామినేషన్ దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అన్ని దశల్లో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పోలింగ్ రోజున ప్రతి సభ్యుడు తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు నైతిక విలువలు పాటిస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఎన్నికల అనంతరం అందరూ ఐక్యంగా పనిచేసి యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

ఈ ఎన్నికలను విజయవంతం చేయడంలో యూనియన్ సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఎన్నికలలో గెలుపొందిన వారు యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పనిచేయాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -