నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చి కామారెడ్డి జిల్లా ప్రణాళిక అధికారిగా, జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టినటువంటి జి రఘనందన్, తిరుమల లను శనివారం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన వారి యొక్క బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పట్ల, విధుల నిర్వహణలో టీఎన్జీవోస్ కామారెడ్డి శాఖ నిబద్ధతతో పని చేయడంతో పాటుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తుందని, ఉద్యోగుల విధి నిర్వహణతో పాటుగా సామాజిక బాధ్యత కలిగిన సంఘంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి లకు వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారులు మాట్లాడుతూ..విధి నిర్వహణలో చిత్తశుద్ధితోపాటు ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న టీఎన్జీవోస్ సంఘం ను అభినందనలు తెలుపుతూ అందరం కలిసి పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలు నిలపడంలో కృషి చేద్దాం అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, కోశాధికారి ఎమ్. దేవరాజు, కేంద్ర సంగం బాధ్యులు కె. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, ఎమ్ సి పోచయ్య, రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ సంతోష్ కుమార్, ఈ సి మెంబర్లు సాయినాథ్, దత్తాద్రి, లక్ష్మణ్, అర్బన్ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ సంయుక్త కార్యదర్శి లక్ష్మి నర్సవ్వ, అర్బన్ ఈ సి మెంబర్ సురేఖ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా అధికారిలను కలిసిన టీఎన్జీవోస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



