Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎన్జీవోల 80 వసంతాల బహిరంగ సభను విజయవంతం చేయాలి

టీఎన్జీవోల 80 వసంతాల బహిరంగ సభను విజయవంతం చేయాలి

- Advertisement -

– టీఎన్జీవోల కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో టీఎన్జీవోల కేంద్ర సంఘ అధ్యక్షులు  మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న సంఘం టీఎన్జీవో సంఘం మాత్రమేనని తెలియజేస్తూ సంఘం ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ సంఘం ఆది నుండి ఉద్యోగుల హక్కుల సాధనకై పోరాటం చేసే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలియజేశారు. 

ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రభుత్వంతో సామరస్య పూర్వకమైన వాతావరణంలో ఉద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మంజూరు చేయించడంలో ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతి నెల సుమారుగా 750 కోట్లు జమ చేయిస్తూ ఇప్పటివరకు 4500 కోట్లకు పైగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. 

పెండింగ్ డే లకు సంబంధించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఉద్యోగుల యొక్క బాధలను తెలియజేస్తూ పెండింగ్లో ఉన్న డీఎల్లను చెల్లించే విధంగా ఒత్తిడి చేయడం ద్వారానే డిఎన్ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మరొక ప్రధానమైన సమస్య ఆరోగ్య భద్రత కార్డులు ఉద్యోగులందరూ ఈ హెచ్ ఎస్ పథకం లేకపోవడం మూలంగా ఆర్థికంగా చితికి పోతున్న విషయాన్ని గుర్తుకు చేస్తూ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఈ హెచ్ ఎస్ కార్డుల మంజూరికై చేస్తున్న ప్రయత్నాన్ని వివరిస్తూ త్వరలోనే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఆ సమావేశం కు ముందే ఈ హెచ్ ఎస్ కార్డ్స్ జారీకి సంబంధించి ఒక తీపి కబురు అందుతుందని తెలియజేశారు.

  ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన పిఆర్సి  సాధించే విధంగా సంఘం నుండి పూర్తిస్థాయిలో పోరాటం జరుగుతుందని, త్వరలోనే ప్రభుత్వం పిఆర్సి విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్  మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన సమస్య ఏదైనా సరే సంఘం పోరాటం చేసే క్రమంలో ముందుంటుందని తెలియజేస్తూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న మరొక ప్రధానమైన సమస్య సిపిఎస్ ఈ విధానాన్ని  ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే పోరాటం చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యంగా సంఘం పోరాడుతుందని తెలియజేశారు. 

టీఎన్జీవో సంఘం దేశంలోనే అన్ని ఉద్యోగ సంఘాలకు ఆదర్శంగా ఉంటూ ఈనెల 23న షిరిడి పట్టణంలో జరిగేటటువంటి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభలకు రాష్ట్ర తరఫున ప్రాతినిథ్యం వహిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘ అనుసరిస్తున్న విధానాలను తెలియజేస్తూ ఉద్యోగుల హక్కుల పోరాటమే ప్రధాన ఎజెండాగా టీఎన్జీవో సంఘం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, కేంద్ర సంఘ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షులు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్,  పోచయ్య, అర్బన్ యూనిట్ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి,  ఆర్ అండ్ బి ఫోరం అధ్యక్షులు సంపత్,  వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -