నవతెలంగాణ – కామారెడ్డి
ముఖ్య ప్రణాళిక శాఖ విభాగంలో డి.ఎస్.ఓ గా పనిచేస్తూ ఎస్.ఓ. గా పదోన్నతి పొందినటువంటి టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖలో ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ను టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగిందని కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ చేసి చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అన్నారు. ఉద్యోగ ప్రస్థానంలో 32 సంవత్సరాలుగా ఎటువంటి రిమార్క్ లు లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గంలో వివిధ స్థాయిలలో పనిచేస్తూ ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసినటువంటి సమస్యల పరిష్కారం అనుభవాన్ని ఆలోచన లను రంగరించి ఉద్యోగుల సమస్యల పట్ల తన వంతు ధర్మాన్ని నిర్వర్తించిన చక్కటి నాయకునిగా, ఉద్యోగ ధర్మం లో పాటు సంఘ నాయకునిగా చక్కగా పనిచేయడం జరిగిందని తెలిపారు.
పదోన్నతిపై కామారెడ్డి జిల్లా గణాంక శాఖలో పదోన్నతి పొంది గణాంక అధికారి గా పదోన్నతి పొందడం చాలా సంతోషంగా ఉందని నూతన హోదాలో కూడా మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు & ఎంప్లాయిస్ చేసి చైర్మన్ శ్రీ నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, జిల్లా సహాధ్యక్షులు చక్రధర్, జిల్లా కోశాధికారి దేవరాజు, కేంద్ర సంఘ భాద్యులు కె.శివకుమార్, జిల్లాఉపాధ్యక్షులు రాజేశ్వర్ చిన్న పోచయ్య సంయుక్త కార్యదర్శి గణేష్, రాజారెడ్డి, రమణ కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, సాయినాథ్, దత్తాద్రి, లక్ష్మణ్ అర్బన్ యూనిట్ ఉపాధ్యక్షులు ఎమ్. కిషన్ మరియు పంచాయతీ కార్యదర్శులు మహేష్, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.



