- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరీ సుదర్శన్ రెడ్డి ని వారి స్వగృహం లో గురువారం టి ఎన్ జి ఓ ఎస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి టీఎన్జీవోస్ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ , జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ తోపాటు అర్బన్ కార్యదర్శి మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


